Saturday, January 16, 2010

ఎవరి వేగం ఎంతెంత?

ఎవరి వేగం ఎంతెంత?
మీరు ఇంటి నుంచి బడికి, తిరిగి బడినుంచి ఇంటికి ఎంత సేపట్లో చేరుతారు? ఈ ప్రశ్నకు జవాబు రెండు అంశాలపై అధారపడి వుంటుంది. ఒకటి - మీ ఇంటి నుంచి బడికి ఎంత దూరం వుంది, రెండు - మీరు ఎంత వేగంగా నడుస్తారు అన్నవే ఆ అంశాలు. అవునా? ఒక నిర్ధిష్ట సమయంలో మీరు ఎంత దూరం పోతారనే దానిని మీ నడకవేగం తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక్క గంటకాలంలో మీరు ఎంత దూరం నడుస్తారనేది మీ నడకవేగం. అలాగే ఒక గంట సమయంలో మీరు ఎంత దూరం పరిగెత్తుతారనేది మీరు పరిగెత్తగలిగే వేగాన్ని తెలుపుతుంది.వివిధ రకాల వాహనాల వేగం ఆయా వాహనాలను బట్టి, నెలకొల్పబడే మిషిన్లను ( యంత్రాలను ) బట్టి నిర్ణయించబడుతుంది. ఈ రోజుల్లో ఆఘమేఘాల మీద ముందుకు సాగిపోయే వాహనాలు మనకు ఎన్నెన్నో కనిపిస్తుంటాయి. ఈ మోటారు బండ్ల సంగతిని కొంచెం పక్కకు పెట్టి, ప్రకృతిలో వివిధ జంతువులు ఎంత వేగంగా ముందుకు పరిగెత్తుతాయి అన్న దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేని కన్నా ఏది వేగంగా పోతుంది. ఎంత వేగంగా పోతుంది అన్న దానిని గమనిస్తూ ఈ వివరాలను చూడండి.
ఖడ్గమృగం గంటకు 45 కి.మీ. pilli
పిల్లిగంటకు 47 కి.మీ.

గబ్బిలన్ గంటకు 24 కి.మీ.

తాబీలు గంటకు 3 కి.మీ.

ఈనుగు గంటకు 39 కి.మీ.

ఎలుక్ గంటకు 10 కి.మీ.

ఒంటె గంటకు 32 కి.మీ.

మనిషి గంటకు 40 కి.మీ.లు (వేగంగా పరిగెత్తితే)గంటకు 17 కి.మీ

పాండా గంటకు 40 కి.మీ.

కుక్క గంటకు 67 కి.మీ.

లీది గంటకు 97 కి.మీ.

కన్గారూ గంటకు 72 కి.మీ.

చిరుతపులి గంటకు 113 కి.మీ.

నక్క్ గంటకు 72 కి.మీ.

కున్దేలు గంటకు 72 కి.మీ.

గుర్రాన్ గంటకు 77 కి.మీ.

జిరాఫీ గంటకు 56 కి.మీ.లు

మామూలు వేగంతో నడిచే మనిషి గంటకు సుమారు 5-6 కి.మీ.ల దూరం పోగల్గుతాడు. అయితే అతను సాధ్యమైనంత వేగంగా పరిగెత్తినట్లయితే మాత్రం ఒక గంట సమయంలో 40 కి.మీ.ల దూరం పోగల్గుతాడు. మరి మీ పరుగు వేగం ఎంతో మీరెప్పుడైనా చూసుకున్నారా? మీ వేగమెంతో తెలుసుకోవడం కోసం సరదాగా ఓ రెండు కిలోమీటర్ల దూరం పరిగెత్తి చూడండి. ఒక వేళ మీరు ఆ రెండు కిలోమీటర్ల దూరాన్ని 5నిమిషాలలో పరిగెత్తారనుకుందాం. అప్పుడు గంటకు, కిలోమీటర్లలో మీ పరుగు వేగం - (2÷5)×60 అవుతుంది. 2/5×60=24 కి.మీ.లు. అర్థమయ్యిందిగా. మీ నడక వేగాన్ని కూడా ఇలాగే తెలుసుకోండి

Tuesday, July 28, 2009

ఆగష్టు మాసంలో ముఖ్యమైన రోజులు

ఆగష్టు 1 - ప్రపంచ మైత్రీ దినోత్సవంలోకంలో తీయనైంది స్నేహమేనోయ్ అన్నారు పెద్దలు. మీరందరూ స్నేహానికి విలువ ఇవ్వవలసిందిగా ఈ రోజు మీకు గుర్తు చేస్తుంది. ఎందరో మహానుభావులు స్నేహితుల సాంగత్యంలోనే గొప్పవారయ్యారు. సావాస దోషంతో కొందరు చెడిపొయ్యారు కూడా.... స్నేహితుల్నీ స్నేహాన్నీ కొనసాగించడంలో ఎంతో మెళకువతో ఉండాలి. నీకు ఎంత మంది స్నేహితులన్నా, ఆప్త మిత్రలు మాత్రం ఒకరిద్దరికి మించి ఉండరు.
ఆగష్టు 6 - హిరోషిమాడేగా జరుపుకొనే ఈ రోజువ 1945 వ సంవత్సరంలో అమెరికా పాశవికంగా జపానులోని హిరోషిమా నగరంపా అణుబాంబు పేల్చిందియ అదే మొదటి అణుబాంబు ప్రయోగం. ఆతర్వాత ఆగస్టు 9వ నాగసాకి పై కూడా మరో బాంబు వేసింది. మానవాళిని లక్షలాదిగా పొట్టన పెట్టుకున్న ఆగష్టు 6వ తేదీ అణుబాంబు ప్రయోగానికి నిరసనగా ప్రతి ఆగష్టు 6 - ను ప్రపంచ శాంతికాముకులు శాంతి ప్రబోదానికి సూచనగా ప్రదర్శనలు చేస్తారు. జన విజ్ఞాన వేదిక ప్రతి సంవత్సరం హిరోషిమా జరుపుతుంది.
ఆగష్టు 9 - నాగసాకి సంస్మరణ దినంఆగష్టు 15 - భారత స్వాతంత్య్ర దినోత్సవంసంపాదకీయం చదవండి.ఆగష్టు 19 - ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంఈ రోజుల్లో ఫోటోల ప్రాధాన్యత వివకించనవసరం లేదు. సైన్సు సాధించిన గొప్ప ప్రక్రియల్లో ఫోటో గ్రఫీ ఒకటి. మీరందరూ ఆ రోజు మీ స్నేహితులతోమూ, ఇంటిల్లిపాదీ ఫోటో దిగండి.
ఆగష్టు 20 - ప్రపంచ దోమల నిర్మూలనా, దినోత్సవంమలోరియా బోధకాలులాంటి విషమవ్యాధులే కాకండా, నిద్రలేమిని కల్గించే పలురకాల దోమల జాతులు మానవ ఆరోగ్యపై శాతాబ్దాలుగా గాడి చేస్తున్నాయి పంటలకు కూడా కొన్ని రకాల దోమలు హాని కల్గిస్తున్నాయి. ప్రపంచ దోమల సంగతేమోగానీ మనదేశంలో మాత్రం దోమలు బాగానే ఉన్నాయి. కొన్ని దేశాల్లో దోమల్ని పూర్తిగా మటుమాయం చేసారంటేమీరు నమ్మగలరా
ఆగష్టు 20 - న ప్రపంచ దోమల నిర్మూలనా దినోత్సవంనాడు మనందరం ఆరుబయట కూచుని దోమలు కుడుకుంటే వాటిని చరుచుకొంటూ దోమల నిర్మూలాదినోత్సవాన్ని జరుపుకొందాం మధ్య మధ్యలో మన దేశంలో ఇంకా ఎందుకు నివారించుకోలేక పోయామో ఆలోచిద్దాం. నిద్రపోనీయకుండా మనల్ని ఆలోచింప జేస్తున్నందుకు దోమల్ని కొనియాడుదాం....

మెదడుకు పదును



1. కొనేటప్పుడు నల్లగా వాడేటప్పుడు ఎర్రగా మరియు పడేసేటప్పుడు బూడిద రంగులో ఉండేది ఏది?


2. ఒక యువతి తన భర్తను షూట్ చేసి 5 నిమిషాలు నీళ్ళల్లో ముంచి చివరిగా వేలాడతీసింది.అయినప్పటికీ 5 నిమిషాల తరువాత వాళ్ళిద్దరూ కలిసి సినిమాకి వెళ్ళారు. ఎలా?

3. ఒక హంతకుడికి ఉరిశిక్ష పడింది.అతనికి 3 గదులు చూపించి ఏదొ ఒక దానిని ఎంచుకోమన్నారు.
1. మొదటి గది మొత్తం మంటలతో నిండి ఉన్నది.
2. రెండవ గది నిండా చేతుల్లో బుల్లెట్లతో నిండి ఉన్న గన్నులతో నరహంతకులు ఉన్నారు.
3. మూడవ గదిలో 3 సంవత్సరాలనుండి ఏమీ తినకుండా ఆకలితో ఉన్న సింహాలు ఉన్నాయి.
హంతకుడు వెళ్ళటానికి ఏ గది క్షేమం?

4. Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, Sunday ఇవి ఏమి కాకుండా వరుసగా వచ్చే మూడు రోజులు చెప్పగలరా?(ఆంగ్లములోనే)

5.రెండు ప్లాస్టికు జగ్గుల్లో నిండా నీళ్ళు ఉన్నాయి.వీటిలోని నీళ్ళను ఒక పీపాయి(లేదా మరోజగ్గు)లోనికి తీసుకొని ఏ నీరు ఎందులోనుండి వచ్చిందో చెప్పగలరా?


6. రెండుని రెండుతో వెయ్యిసార్లు గుణిస్తే ఎంతవస్తుంది?

7. మేరీ వాళ్ళ నాన్నకు అయిదుగురు అమ్మాయిలు ఉన్నారు.వారి పేర్లు Nana, Nene, NiNi మరియు NoNo అయిదవ అమ్మాయి పేరు ఏమిటి?

8. కింది వాక్యం చదవండి.

FINISHED FILES ARE THE RESULT OF YEARS OF SCIENTIFIC STUDY
COMBINED WITH THE EXPERIENCE OF YEARS

ఇప్పుడు పైన ఉన్న వాక్యంలో ఎన్ని F లు ఉన్నాయో చెప్పగలరా?

గమనిక: ఒక్కసారే లెక్కపెట్టాలి, మీకు మొదటిసారి ఎన్ని వచ్చాయో అవే చెప్పండి.



సమాధానాలు



1)బొగ్గు.
2)తను తీసింది ఫోటో.
3)మూడవ గది ఎందుకంటే మూడుసంవత్సరాలనుండి ఏమీతినకపొతే సింహాలు చనిపోతాయి.

4)Yesterday,Today,Tomorrow.
5)రెండు ప్లాస్టికు జగ్గుల్లో ఉన్న నీటిని ముందుగా ఐసులాగ గడ్డకట్టించండి. ఇప్పుడు ఏ నీరు ఎందులోనుండి వచ్చిందో చెప్పటం సులభమే కదా!!
6)4, 2 ని 2 తో ఎన్నిసార్లు గుణించినా 4ఏ వస్తుంది.
7)మేరీ
8) 6

సులభంగా తెలుగు అంకెలు నేర్చుకొనడం ఎలా?

సులభంగా తెలుగు అంకెలు నేర్చుకొనడం ఎలా?

మీకు అంతర్జాతియ ప్రమాణాలలోని హిందూ అంకెలు వచ్చు అని అనుకుంటున్నాను, అవి 0 1 2 3 4 5 6 7 8 9

ఇప్పుడు తెలుగు అంకెలు
వీటిని ఈ క్రింది విధములుగా విభజించుదాము
** ఇంగ్లీషు అంకెలులాగా ఉండునవి 0, 3
హిందూ అంతర్జాతియ సంజ్ఞలు ౦ ౩
తెలుగు అంకెలు ౦ ౩

** కొద్దిగా ఇంగ్లీషు అంకెలుగా ఉండునవి 4
4


** ఆరూ, తొమ్మిదీ 6, 9
6 9
౬ ౯
గమనించినారా? 6, 9 లు ఎప్పటినుండో బంధువులనుకుంటా!

** సున్నాలాగా ఉండునవి 1, 8
1 8
౧ ౮
చూసినారా! ఒక్కటికేమో సున్నాకి క్రింద ఒక రంద్రం చెయ్యండి!
ఎనిమిదికేమో పైన ఒక రంద్రం పెట్టి తలకట్టు కొట్టండి!

** ఇంగ్లీషు యస్సు (s) లాగా ఉండునవి 5, 7
5 7
౫ ౭
ఐదుకేమో ఒక greater than symbol వేసి, పక్కన యస్సు వ్రాయండి!
ఏడుకేమో యస్సుని అద్దంలో చూపించండి!

*** ఇహ మిగిలిపొయినది, రెండు మాత్రమే, దీనిని గుర్తు ఉంచుకోవడం చాలా తేలిక!
మనకు “చ” లు “జ” లు మూడు ఉంటాయి అని తెలుసు కదా, వీటిలో రెండొవదాని నెత్తిమీద వేసే గుర్తే రెండు అదే ౨
౨ = 2

Tuesday, July 7, 2009

ఒకే కాన్పులో ఎనిమిది మంది జననం

ఒకే కాన్పులో ఎనిమిది మంది జననం
దేవునిదయ కలిగితే సాధ్యం కానిదంటూ ఏదీవుండదు. అలాంటిది అమెరికాలో ఒక మహిళకు ఏకంగా ఒకే కాన్పులో ఎనిమిది మంది సంతానం కలిగారు.

ఒక మహిళ ఒకేసారి ఆరుమంది అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి లాస్ ఏంజల్స్ లోనున్న ఓ ఆసుపత్రిలో డాక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఈ ఎనిమిదిమంది పిల్లలు ఆరోగ్యంగా వున్నారని ఆసుపత్రి డాక్టర్ కారెన్ మేపలేస్ తెలిపారు. వీరిని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచినట్లు ఆయన తెలిపారు.

ఈ పిల్లలకు జన్మనిచ్చే తల్లికి ప్రసవ తారీఖు కన్నా తొమ్మిది వారాల ముందే ఆమెకు సిజేరియన్ చేసి ఆరు మంది పిల్లలకు పురుడు పోసారు. మిగిలిన ఇద్దరిని వెంటిలేటర్ల సహాయంతో గర్భాశయంనుంచి బయటకు తీసినట్లు డాక్టర్లు పేర్కొన్నారు.

ఈ అసామాన్యమైన ప్రసవానికి 46మంది డాక్టర్లు ఒక గ్రూపుగా కలిసి ఆపరేషన్ చేసి ఎనిమిది మంది పిల్లలకు పురుడు పోసారు.
తల్లి పిల్లలు క్షేమంగా వున్నారని ఆ డాక్టర్ల బృందం పేర్కొంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పిల్లల బరువు 680గ్రాములనుంచి 1.47 కిలోగ్రాములవరకువున్న ఈ పిల్లలను ఇంగ్లీషు వర్ణమాల ప్రకారం ఏ నుండి హెచ్‌లుగా వీరిని గుర్తించక తప్పదని డాక్టర్లు అభిప్రాయపడ్డారు.

ఇదిలావుండగా ఇదివరకు 1998లో కూడా ఒక మహిళ ఎనిమిది మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఆమె ఆరుమంది బాలికలు, ఇద్దరు బాలురకు జన్మనిచ్చింది. వీరిలో ఒక అమ్మాయి వారం తర్వాత చనిపోయిందని వైద్యులు తెలిపారు.

మేము సైతం... మద్యం మత్తులో మహిళామణులు

ఆధునికత వెర్రితలలు వేస్తున్న ప్రస్తుత తరుణంలో పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూపించే దిశగా మహిళలు సైతం మందు గ్లాసు చేపడుతున్నారు. అభివృద్ధిలో పురుషులకు తామేమాత్రం తీసిపోమని చాటుతున్న మహిళలు అలవాట్లలోనూ ఓ అడుగు ముందుకేస్తున్నారు. కొన్నాళ్ల వరకు మద్యం రుచి తెలియని మహిళల్లో చాలామంది ప్రస్తుతం మద్యం వ్యసనానికి క్రమంగా అలవాటు పడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. మహిళల పరంగా తీసుకుంటే 19 నుంచి 26 ఏళ్ల వయసులో ఉన్న కొందరు అమ్మాయిల్లో ఈ మద్యం అలవాటు క్రమంగా వ్యసనంగా మారుతోందని సర్వేలు రుజువు చేస్తున్నాయి.అసోచాం అనే సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఇంటికి దూరంగా హాస్టల్ జీవితానికి అలవాటు పడిన యువతలో దాదాపు 60 శాతం మంది మద్యానికి బానిసలవుతున్నారు. వీరిలో అమ్మాయిలు సైతం తమ వంతు పాత్ర పోషిస్తుండడం విశేషం. మారుతున్న కాలానికి అనుగుణంగా తామూ మారడం కోసం చేసే ప్రయత్నంలో అమ్మాయిలు మద్యం, పొగతాగే అలవాటుకు గురవుతున్నారని ఈ సర్వే పేర్కొంది.ఈ సర్వే ప్రకారం ఫ్రెండ్స్ బలవంతం కోసం తాగేవారు కొందరైతే, పక్కనున్నవారు తాగుతున్నారు కదా అని తాము ఆ తాగుడుకు అలవాటుపడేవారు మరికొందరు. అలాగే తాగడం ద్వారా పొగపీల్చడం ద్వారా అబ్బాయిలు పొందే ఆనందాన్ని తామూ పొందాలన్న భావంతో కూడా కొందరు అమ్మాయిలు ఈ అలవాటుకు సై అంటున్నారట.

అమ్మాయిలకన్నాకూడా అబ్బాయిలకే తీపి పదార్థాలంటే ఇష్టం


అమ్మాయిలకన్నాకూడా అబ్బాయిలకే తీపి పదార్థాలంటే ఇష్టం అన్న విషయం పరిశోధనల్లో తేలింది. తీపి పదార్థాలు అమ్మాయిలకన్నాకూడా అబ్బాయిలను ఎక్కువగా ఆకర్షిస్తాయని డెన్మార్క్‌కు చెందిన కోపెన్ హెగన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధనాకారులు తెలిపారు.

రుచికి సంబంధించినంతమేరకు అబ్బాయిలకన్నాకూడా అమ్మాయిలకే ఎక్కువ స్పర్శ కలుగుతుంది. కాని తీపి పదార్థాల విషయానికి వస్తే అమ్మాయిలకన్నా అబ్బాయిలకే ఎక్కువ ఇష్టం అని పరిశోధనల్లో తేలినట్లు తెలిసింది.

కోపెన్ హెగన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధనాకారులు అమ్మాయిలు, అబ్బాయిలపై జరిపిన పరిశోధనల్లో అబ్బాయిలు ఎక్కువగా తీపి పదార్థాలనే ఇష్టపడ్డారని అదికూడా పులుపు పదార్థాలంటే వారిలో కేవలం 10శాతం మంది మాత్రమే ఇష్టత చూపారని తేలింది.

దాదాపు 9వేలమంది పాఠశాల విద్యార్థులపై పరిశోధన చేసి వారు తీసుకునే ఆహార పదార్థాల శ్యాంపిల్స్‌ను సేకరించి వారి ఆహారపుటలవాట్ల పై ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు పరిశోధకులు తెలిపినట్లు డెన్మార్క్‌కు చెందిన ఓ వార్తా పత్రిక తెలిపింది.

ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు 30శాతం విద్యార్థినులు చక్కెర(తీపి)లేని శీతల పానీయాలంటే వారికి ఇష్టమని తేలింది.

దీంతో తమ పరిశోధనలవలన అబ్బాయిలకు కాస్త పుల్లటి ఆహార పదార్థాలుకూడా శరీరానికి కావాలికాబట్టి వారికోసం ప్రత్యేకంగా పుల్లటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తయారు చేసేందుకు కంపెనీలు ముందుకురావాలని పరిశోధనకు నేతృత్వం వహించిన బోదిల్ ఎలేసన్ హోమ్ సూచించారు.