ఒకే కాన్పులో ఎనిమిది మంది జననం
దేవునిదయ కలిగితే సాధ్యం కానిదంటూ ఏదీవుండదు. అలాంటిది అమెరికాలో ఒక మహిళకు ఏకంగా ఒకే కాన్పులో ఎనిమిది మంది సంతానం కలిగారు.
ఒక మహిళ ఒకేసారి ఆరుమంది అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి లాస్ ఏంజల్స్ లోనున్న ఓ ఆసుపత్రిలో డాక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఈ ఎనిమిదిమంది పిల్లలు ఆరోగ్యంగా వున్నారని ఆసుపత్రి డాక్టర్ కారెన్ మేపలేస్ తెలిపారు. వీరిని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచినట్లు ఆయన తెలిపారు.
ఈ పిల్లలకు జన్మనిచ్చే తల్లికి ప్రసవ తారీఖు కన్నా తొమ్మిది వారాల ముందే ఆమెకు సిజేరియన్ చేసి ఆరు మంది పిల్లలకు పురుడు పోసారు. మిగిలిన ఇద్దరిని వెంటిలేటర్ల సహాయంతో గర్భాశయంనుంచి బయటకు తీసినట్లు డాక్టర్లు పేర్కొన్నారు.
ఈ అసామాన్యమైన ప్రసవానికి 46మంది డాక్టర్లు ఒక గ్రూపుగా కలిసి ఆపరేషన్ చేసి ఎనిమిది మంది పిల్లలకు పురుడు పోసారు.
తల్లి పిల్లలు క్షేమంగా వున్నారని ఆ డాక్టర్ల బృందం పేర్కొంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పిల్లల బరువు 680గ్రాములనుంచి 1.47 కిలోగ్రాములవరకువున్న ఈ పిల్లలను ఇంగ్లీషు వర్ణమాల ప్రకారం ఏ నుండి హెచ్‌లుగా వీరిని గుర్తించక తప్పదని డాక్టర్లు అభిప్రాయపడ్డారు.
ఇదిలావుండగా ఇదివరకు 1998లో కూడా ఒక మహిళ ఎనిమిది మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఆమె ఆరుమంది బాలికలు, ఇద్దరు బాలురకు జన్మనిచ్చింది. వీరిలో ఒక అమ్మాయి వారం తర్వాత చనిపోయిందని వైద్యులు తెలిపారు.
Tuesday, July 7, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment