Tuesday, July 7, 2009
మేము సైతం... మద్యం మత్తులో మహిళామణులు
ఆధునికత వెర్రితలలు వేస్తున్న ప్రస్తుత తరుణంలో పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూపించే దిశగా మహిళలు సైతం మందు గ్లాసు చేపడుతున్నారు. అభివృద్ధిలో పురుషులకు తామేమాత్రం తీసిపోమని చాటుతున్న మహిళలు అలవాట్లలోనూ ఓ అడుగు ముందుకేస్తున్నారు. కొన్నాళ్ల వరకు మద్యం రుచి తెలియని మహిళల్లో చాలామంది ప్రస్తుతం మద్యం వ్యసనానికి క్రమంగా అలవాటు పడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. మహిళల పరంగా తీసుకుంటే 19 నుంచి 26 ఏళ్ల వయసులో ఉన్న కొందరు అమ్మాయిల్లో ఈ మద్యం అలవాటు క్రమంగా వ్యసనంగా మారుతోందని సర్వేలు రుజువు చేస్తున్నాయి.అసోచాం అనే సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఇంటికి దూరంగా హాస్టల్ జీవితానికి అలవాటు పడిన యువతలో దాదాపు 60 శాతం మంది మద్యానికి బానిసలవుతున్నారు. వీరిలో అమ్మాయిలు సైతం తమ వంతు పాత్ర పోషిస్తుండడం విశేషం. మారుతున్న కాలానికి అనుగుణంగా తామూ మారడం కోసం చేసే ప్రయత్నంలో అమ్మాయిలు మద్యం, పొగతాగే అలవాటుకు గురవుతున్నారని ఈ సర్వే పేర్కొంది.ఈ సర్వే ప్రకారం ఫ్రెండ్స్ బలవంతం కోసం తాగేవారు కొందరైతే, పక్కనున్నవారు తాగుతున్నారు కదా అని తాము ఆ తాగుడుకు అలవాటుపడేవారు మరికొందరు. అలాగే తాగడం ద్వారా పొగపీల్చడం ద్వారా అబ్బాయిలు పొందే ఆనందాన్ని తామూ పొందాలన్న భావంతో కూడా కొందరు అమ్మాయిలు ఈ అలవాటుకు సై అంటున్నారట.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment