Tuesday, July 7, 2009

అమ్మాయిలకన్నాకూడా అబ్బాయిలకే తీపి పదార్థాలంటే ఇష్టం


అమ్మాయిలకన్నాకూడా అబ్బాయిలకే తీపి పదార్థాలంటే ఇష్టం అన్న విషయం పరిశోధనల్లో తేలింది. తీపి పదార్థాలు అమ్మాయిలకన్నాకూడా అబ్బాయిలను ఎక్కువగా ఆకర్షిస్తాయని డెన్మార్క్‌కు చెందిన కోపెన్ హెగన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధనాకారులు తెలిపారు.

రుచికి సంబంధించినంతమేరకు అబ్బాయిలకన్నాకూడా అమ్మాయిలకే ఎక్కువ స్పర్శ కలుగుతుంది. కాని తీపి పదార్థాల విషయానికి వస్తే అమ్మాయిలకన్నా అబ్బాయిలకే ఎక్కువ ఇష్టం అని పరిశోధనల్లో తేలినట్లు తెలిసింది.

కోపెన్ హెగన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధనాకారులు అమ్మాయిలు, అబ్బాయిలపై జరిపిన పరిశోధనల్లో అబ్బాయిలు ఎక్కువగా తీపి పదార్థాలనే ఇష్టపడ్డారని అదికూడా పులుపు పదార్థాలంటే వారిలో కేవలం 10శాతం మంది మాత్రమే ఇష్టత చూపారని తేలింది.

దాదాపు 9వేలమంది పాఠశాల విద్యార్థులపై పరిశోధన చేసి వారు తీసుకునే ఆహార పదార్థాల శ్యాంపిల్స్‌ను సేకరించి వారి ఆహారపుటలవాట్ల పై ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు పరిశోధకులు తెలిపినట్లు డెన్మార్క్‌కు చెందిన ఓ వార్తా పత్రిక తెలిపింది.

ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు 30శాతం విద్యార్థినులు చక్కెర(తీపి)లేని శీతల పానీయాలంటే వారికి ఇష్టమని తేలింది.

దీంతో తమ పరిశోధనలవలన అబ్బాయిలకు కాస్త పుల్లటి ఆహార పదార్థాలుకూడా శరీరానికి కావాలికాబట్టి వారికోసం ప్రత్యేకంగా పుల్లటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తయారు చేసేందుకు కంపెనీలు ముందుకురావాలని పరిశోధనకు నేతృత్వం వహించిన బోదిల్ ఎలేసన్ హోమ్ సూచించారు.

No comments:

Post a Comment